ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

బీబీనగర్/ ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గ్రామం అభివృద్ధి పరచడమే తన ధ్యేయమని ముగ్దుంపల్లి సర్పంచ్ శిగ నరేష్ అన్నారు. మండలంలోని మహిళలు స్వచ్ఛందంగా రోడ్లలోని చెత్త సేకరించి శుభ్రపరిచి పరిశుభ్రత పట్ల తమ బాధ్యతను చాటారు. “పరిశుభ్రమైన గ్రామమే – ఆరోగ్యకరమైన సమాజం” అనే నినాదంతో ఈ కార్యక్రమం సాగుతున్నట్టు ఆయన తెలిపారు.

అనంతరం తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply