150degrees | అల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది?

150degrees | అల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది?

150degrees | స్కాట్లాండ్‌లో వాటర్ క్రిమేషన్‌కు అధికారిక అనుమతి
పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ఫ్యూనరల్ విధానం
ఇప్పటికే అమల్లో ఉన్న దేశాలు
ప్రజల మద్దతుతో ముందుకు వచ్చిన కొత్త అంత్యక్రియల విధానం

150degrees | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సాధారణంగా మృతదేహాలను ఖననం చేయడం లేదా దహనం చేయడం మాత్రమే మనం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా స్కాట్లాండ్ దేశం అంత్యక్రియల విధానాల్లో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. “వాటర్ క్రిమేషన్” అనే ఆధునిక పద్ధతికి స్కాట్లాండ్ ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది.

ఈ ప్రక్రియలో మృతదేహాన్ని ప్రత్యేకమైన లోహ ఛాంబర్‌లో ఉంచి దాదాపు 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీరు, 5% అల్కలైన్ రసాయన ద్రావణంతో ఖననం చేస్తారు. దీంతో సహజంగా నేలలో శరీరం ఏ విధంగా క్షీణిస్తుందో అదే విధంగా ఈ పద్ధతి పనిచేస్తుందని స్కాట్లాండ్ అధికారులు తెలిపారు.

150degrees
150degrees

ఈ ఖనన విధానాన్ని శాస్త్రీయంగా అల్కలైన్ హైడ్రోలిసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో మృతదేహాన్ని నీరు, అల్కలైన్ ద్రావణంతో కూడిన ప్రత్యేకమైన యంత్రంలో ఉంచి అధిక ఉష్ణోగ్రతలో మూడు నుంచి నాలుగు గంటల పాటు అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఈ విధానంలో శరీరం పూర్తిగా కరిగిపోతుంది. మిగిలిన ఎముకలను పొడిగా చేసి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

ఈ విధానం ఇప్పటికే అమెరికా, కెనడా, ఐర్లాండ్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్‌లో మొదటిసారి స్కాట్లాండ్ ఈ పద్ధతిని అధికారికంగా అనుమతించింది. పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టామని నిపుణులు తెలిపారు. సాంప్రదాయ దహన సంస్కారాల్లో కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉండగా, ఈ విధానంలో అవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దీనిని “గ్రీన్ ఫ్యూనరల్” అని కూడా పిలుస్తున్నారు.

ఈ కొత్త విధానంపై సుమారు 84 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపినట్లు సర్వేలో వెల్లడైందని స్కాట్లాండ్ ఆరోగ్య మంత్రి జెన్నీ మింటో తెలిపారు.

Leave a Reply