ప్రమాదకరంగా ఇనుప స్తంభం

ప్రమాదకరంగా ఇనుప స్తంభం

పట్టించుకోని విద్యుత్ ఏఈ

సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామంలో ఇనుప విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా రోడ్డు కూడలిలో ఉంది. పలుమార్లు విద్యుత్ ఏఈకి మొరపెట్టుకున్నా స్పందించడం లేదంటూ గుడిమల్కాపురం బీజేపీ నాయకుడు ఊడుగు నాగరాజ్ గౌడ్ తెలిపారు.

20 రోజుల క్రితం వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. వర్షాలు కురిస్తే విద్యుత్ స్థంభం నుండి కరెంట్ షాక్ కొడుతుందని ప్రమాదం జరగకుండానే త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు.

Leave a Reply