నిరుపేదలకు నిత్యవసరాల పంపిణీ

నిరుపేదలకు నిత్యవసరాల పంపిణీ

చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేటలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, నగదు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవలో భాగంగా లక్కీ రోడ్ లైన్స్ అధినేత మొహమ్మద్ యూసుఫ్ తన నివాసం వద్ద ఆదివారం 500 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది దానధర్మాలు, పరస్పర సహకారం, పేదల పట్ల సానుభూతి చూపించే పవిత్ర కాలమని పేర్కొన్నారు.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూత అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పేదలకు సహాయం చేయడం ద్వారా సమాజంలో సానుభూతి, సహకార భావాలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని వారు సూచించారు. ముఖ్యంగా పండుగల సమయంలో నిరుపేదలను ఆదుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మొహమ్మద్ యూసుఫ్ కుటుంబ సభ్యులు మొహమ్మద్ కరీమా, డాక్టర్ అబ్దుల్ బాసీత్, షేక్ నజీర్ అహమ్మద్, రహీమ్, బాను, అమ్ము పాల్గొన్నారు. అలాగే విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీమతి రుద్రమదేవి, ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ కందిమళ్ల జయమ్మ, కరణం విజయలక్ష్మి, సాదినేని పద్మ, పుప్పాల రమాదేవి తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా సనా సభ్యులు, సిబ్బంది ముజీబ్, ఆనందరావు, షరీఫ్, ఉస్మాన్, మొహిద్దీన్, సుభాని, బాబావలి, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పెద్ద సంఖ్యలో నిరుపేదలు హాజరై నిత్యావసర వస్తువులు, నగదు స్వీకరించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు సహాయం చేయాలని మొహమ్మద్ యూసుఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమం సోదరభావం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

Leave a Reply