ఎస్వీఐటిలో ఎలెక్ట్రోమానియా 2కె26…

ఎస్వీఐటిలో ఎలెక్ట్రోమానియా 2కె26…

రాప్తాడు, ఆంధ్రప్రభ : శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలెక్ట్రోమానియా 2కె26 జాతీయ సాంకేతిక కార్యక్రమంను గత రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహించామని కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.కె.యు అటల్ ఇన్‌క్యూబేషన్ సెంటర్ సీఈఓ సి.చంద్ర మౌళి హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని తెలిపారు.

రెండు రోజులు పీపీటీ ప్రెజెంటేషన్ సర్క్యూట్ హంట్ క్విజ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి వివిధ పోటీలు నిర్వహించారు.విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ముగింపు రోజు వాలెడిక్టరీ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి ఎం.డి.వి. రమాకాంత్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ టి.విష్ణువర్ధన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. విజయ భాస్కర్ ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ వి. వెంకటేశ్వర రెడ్డి ప్రొఫెసర్ డాక్టర్ వి.షావలి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply