9:30 am | ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం…

ఘనంగా మహా కుంభాభిషేక మహోత్సవాలు..
రెండో రోజు విశేష క్రతువులు.. భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయం
కృష్ణా నదిలో పుణ్యస్నానం అనంతరం స్వామీజీ అమ్మవారి దర్శనం..
9:30 am | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపుతూ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజు శనివారం అత్యంత వైభవంగా కొనసాగాయి. వేద మంత్రోచ్చారణల నడుమ, యజ్ఞహోమాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మహోత్సవాల సందర్భంగా విచ్చేసిన పూజ్యశ్రీ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర స్వామీజీ తెల్లవారుజామున పవిత్రమైన కృష్ణా రివర్ లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం సుమారు 9:30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి స్వామీజీ ప్రత్యేక పూజలను నిర్వహించారు.

9:30 am | రెండో రోజు పూజలు ఇలా…
మహా కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అష్టోత్తర కలశ స్థాపన, విశేష హోమాలు, చండీయాగం, వేదపారాయణాలు శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. ఆలయ శిఖరాలపై ప్రతిష్ఠించిన కలశాలకు పవిత్ర తీర్థాలతో అభిషేకం చేయడానికి ముందు జరిగే ఈ క్రతువులకు వేదపండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. యజ్ఞశాల పరిసరాల్లో భక్తులు హోమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహా కుంభాభిషేకం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆలయ గోపురాలు, శిఖరాలు, మండపాలు, ధ్వజస్తంభం వంటి నిర్మాణాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయడం ద్వారా ఆలయ శక్తి పునరుద్ధరణ జరుగుతుందని ఆగమ శాస్త్రాలు పేర్కొంటాయి. అందువల్ల ఈ మహోత్సవానికి విశేష ప్రాధాన్యం ఉందని వేదపండితులు చెబుతున్నారు.
9:30 am | విస్తృత ఏర్పాట్లు..
భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

9:30 am | కుంభాభిషేకం..
ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేకం మహోత్సవంలో భాగంగా ఈ మహోత్సవాల ప్రధాన ఘట్టమైన మహా కుంభాభిషేకం ఆదివారం (మార్చి 8) ఉదయం 9:34 గంటలకు వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

CLICK HERE TO READ MORE : 9mm Pistol | కార్డన్ సెర్చ్ లో కలకలం