యూనిఫాం వేసుకోలేదని..

యూనిఫాం వేసుకోలేదని..
- విద్యార్థుల మెడలో చెప్పుల దండలు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఉయ్యూరు, ఆంధ్రప్రభ ; ఓ ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులకు అవమానం జరిగింది. పాఠశాలకు చెప్పులు, సివిల్ డ్రస్ట్ లో వచ్చిన విద్యార్థులను మెడలో చెప్పులు దండలు వేయించిన సంఘటన కృష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో జరిగింది. ఈ ఘటన శుక్రవారం జరుగగా.. శనివారం వెలుగులకు వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం సందర్భంగా విద్యార్థులకు సివిల్ డ్రస్ లో చెప్పులు వేసుకుని వచ్చారు.
దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ లక్ష్మి సుమారు 15 మంది విద్యార్థుల మెడలో చెప్పుల దండలు వేసి అవమానించారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిన ఊకోటి వంశీకృష్ణ అనే విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు. రాత్రి కళాశాలలో పాఠశాలకు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడం, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ కూడా ఫోన్ కు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం ఈ విషయమై ప్రిన్సిపాల్ ను నిలదీయగా, తప్పించుకునే సమాధానాలు చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహించి విద్యాశాఖ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. ప్రిన్సిపల్ చేసిన వ్యవహారంపై లిఖితపూర్వకంగా లేఖలు రాసి విద్యాశాఖ అధికారులకు అందించారు. విద్యార్థుల మెడలో చెప్పుల దండలు వేయడం కృష్ణా జిల్లాలో సంచలనంగా మారింది. క్రమశిక్షణతో పిచ్చినా బుద్ధులు నేర్పించవలసిన ప్రవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయటం మంచి పద్ధతి కాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
