అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగా నరేష్ అన్నారు. గురువారం అంగన్వాడి కేంద్రంలో వీహెచ్ఎన్ డి సమావేశం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు బాల అమృతం, గుడ్లను పంచాయతీ సెక్రెటరీ సిహెచ్ జ్యోతి తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గంగా నరేష్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలని, అంగన్వాడి సెంటర్లను చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జి.కీర్తిన, అంగన్వాడీ టీచర్ జె. కమలాదేవి, కాటన్ సీడ్స్ ఎన్జీవో సంస్థ సిబ్బంది నవ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
