పేద కుటుంబాలకు వరం ఇందిరమ్మ ఇండ్లు…

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండలంలోని విస్సన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు కొత్త బట్టలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
లబ్ధిదారుల ఖాతాలో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వాటిని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామంలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల భారీగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రతి పథకం పేద కుటుంబానికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు, మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు తిరుమల స్వామి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యాదగౌడ్, మాజీ సర్పంచి రాములు పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.
