Colton mine | 200 మందికి పైగా మృతి..!

Colton mine | 200 మందికి పైగా మృతి..!
Colton mine | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆఫ్రికా దేశం (African country) కాంగోలో పెను విషాదం చోటుచేసుకుంది. కాంగోలో భారీ వర్షాలు, కొండచరియలు కూలడంతో రుబయా కోల్టన్ గని (Colton mine) పూర్తిగా కుప్పకూలింది.
ఈ దారుణ ప్రమాదంలో దాదాపు 200 మందికి పైగా మృతి (200 people died) చెందారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు కాంగో గనుల మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ గని ప్రస్తుతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ప్రమాదానికి బాంబులే కారణమని, కేవలం 5 మంది మాత్రమే మరణించారని రెబల్ గ్రూప్ (rebel group) ప్రకటించుకుంది. ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గణాంకాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
