కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం

కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం
- 400 కూలర్లు దగ్గం
- 10 నుండి 15 లక్షల రూపాయలు నష్టం
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు నగర శివారులోని భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ నగర్ లోని ఓ కూలర్ తయారీ కేంద్రంలో ఈప్రమాదం జరగడంతో ఇచ్చే బొమ్మ దాదాపు 400 కూలర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేసవి కాలంలో రావడంతో బాలాజీ నగర్ కు చెందిన రాధాకృష్ణ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 4 లారీల కూలర్లు తయారు చేసి సిద్దం చేశారు.
ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకుంటూ సమయంలో ఈ ప్రమాదం వ్యాపించి ప్రమాదం జరిగిందని బాధితుడు వాపోయాడు. దాదాపు 10 నుండి 15 లక్షల రూపాయలు నష్టం జరిగినట్లు ఆ దుకాణ యజమాని. భావిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక యంత్రాంగం వేగంగా చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
