బాసర ట్రిపుల్ ఐటీలో ముదురుతున్న వివాదం

బాసర ట్రిపుల్ ఐటీలో ముదురుతున్న వివాదం

  • అధికారులు వర్సెస్ విద్యార్థులు
  • అధికారులు వేధిస్తున్నారని పీయూసీ విద్యార్థి ఆరోపణ

బాసర, ఆంధ్రప్రభ ; ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో అధికారులు వర్సెస్ విద్యార్థుల మధ్య వివాదం ముదురుతోంది.కొన్ని రోజుల క్రితం విద్యార్థులు సమాచార హక్కు చట్టం ద్వారా యూనివర్సిటీకి వస్తున్న నిధుల వివరాలను తీసుకున్నారు.ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు పక్క దారి పట్టాయని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాలుగు ఐదు సంవత్సరాలలో యూనివర్సిటీకి వచ్చిన నిధులలో సుమారు 57 కోట్ల వరకు పక్కదారి పట్టాయని విద్యార్థులు ఆరోపించారు.

తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ పేరుతో యూనివర్సిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని విద్యార్థులు లేఖలు విడుదల చేయడం కలకలం రేపుతుంది. యూనివర్సిటీకి వచ్చే నిధుల విషయం పై యూనివర్సిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులు జీవో జారీల పై వ్యత్యాసాలు ఉంటాయని యూనివర్సిటీ అధికారులు ఓ లేఖ లో పేర్కొన్నారు. విద్యార్థిని వేదించినట్లు మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు పియుసి 2 చదువుతున్న మనీష్ రెడ్డి అనే విద్యార్థి యూనివర్సిటీ అధికారుల పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మార్కుల్లో వచ్చిన తేడాను ప్రశ్నించినందుకు తన ఫోన్ లాక్కొని రాత్రంతా నిర్బంధించారని మనీష్ రెడ్డి సోషల్ మీడియాలో వీడియో లో ఆరోపించారు. టి ఎస్ ఏ ఎస్ ( తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ) సంఘం నాయకులతో మనీష్ రెడ్డి కలిసి మానవ హక్కుల సంఘంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బాసర త్రిబుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలు విద్యార్థులపై జరుగుతున్న అమానుష ఘటనలపై సుమారు రెండు వేల మంది విద్యార్థులతో చర్చించిన టి.ఎస్.ఏ.ఎస్ విద్యార్థి సంఘం నేతలు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు, పి.యు.సి -2 విద్యార్థి మనిష్ రెడ్డి పై జరిగిన అమానుష ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు టి ఎస్ ఏ ఎస్ పోరాటం చేస్తుందని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు.ఈ విషయల పై యూనివర్సిటీ స్పందించడం లేదు. యూనివర్సిటీ విద్యార్థులు, అధికారుల మధ్య అగాధం పెరుగుతుంది.ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సిందే.

Leave a Reply