ప్రతి గ్రామానికి సీసీ కెమెరాలు తప్పనిసరి…

ప్రతి గ్రామానికి సీసీ కెమెరాలు తప్పనిసరి…

సంగెం, ఆంధ్రప్రభ : మామునూరు ఏసీపి వెంకటేష్, సిఐపర్వతగిరి రాజగోపాల్ కాపుల కనపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ సహకారంతో 16 కొత్త కెమెరాలు ఏర్పాటు చేసి ప్రారంభించారు. వీటితోపాటు ఎస్సై వంశీకృష్ణ యాక్సిడెంట్లు జరగకుండా ఏర్పాటుచేసిన రేడియం పెట్రోలింగ్ కారును రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ యాక్సిడెంట్లు, దొంగతనాలు జరగకుండా ఈ రేడియం ఇమేజ్ కలిగిన పోలీస్ కారు కాపాడుతుందని చెప్పారు.

సిఐ మాట్లాడుతూ కాపుల కనపర్తి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో అందరూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా పట్టించుకున్నట్లయితే రానున్న కాలంలో యాక్సిడెంట్లు, దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply