విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం…

విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం…
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ప్రత్యేక ఆహ్వానం
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో ఈ నెల 8న నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ నాభిశిలాంబ (బొడ్రాయి) శ్రీ ముత్యాలమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోతురాజు స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహోత్సవానికి శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావును ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించారు. దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పర్వతనేని జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నాగిరెడ్డి తదితరులు సోమవారం కలిసి శాసనసభ్యునికి ఆహ్వాన శుభపత్రికను అందజేశారు. ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
