Modi | మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై మోడీ స్పందన

Modi | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో ప్రధాని మోడీ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత దాడులు, ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, శత్రుత్వాలను వెంటనే నిలిపివేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై చేసిన తాజా దాడులను కూడా ప్రధాని మోడీ ఖండించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు పెరిగిన నేపథ్యంలో ఈ టెలిఫోన్ సంభాషణ జరగడం దౌత్యపరంగా ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు.

Leave a Reply