మహిళల సాధికారికతకు అడుగులు

మహిళల సాధికారికతకు అడుగులు

ఎన్‌ఐఆర్‌డీ శిక్షణకు 45 మంది స్వయం సహాయక సంఘ మహిళలు..
ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారికతకు దోహదపడే దిశగా కీలక కార్యక్రమం ఆరంభమైంది. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో 45 మంది స్వయం సహాయక సంఘ మహిళలు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ అండీ పంచాయతీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డీ) ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఆదివారం బయలుదేరారు.

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్డీయే కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. కేసినేని ఫౌండేషన్, ఎన్‌ఐఆర్‌డీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమం మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది.

ఇందులో మష్రూమ్ పెంపకం, గృహాధారిత ఉత్పత్తుల తయారీ వంటి ఉపాధి ఆధారిత నైపుణ్యాలపై మహిళలకు ప్రాయోగిక శిక్షణ అందించనున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యమని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా మహిళల ఆర్థిక సాధికారికత కోసం ఈ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలోనే సుమారు 500 మంది మహిళలకు ఎంపీ స్వంత నిధులతో శిక్షణ అందించారని జంపాల సీతారామయ్య వెల్లడించారు.

ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని, కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా ఎన్‌ఐఆర్‌డీ రూరల్ కోఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, సహకార బ్యాంకు అధ్యక్షుడు కోయ నెహ్రూ, కౌన్సిలర్ పులిదాసు, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్, ఎస్టీ నాయకుడు మేడా శ్రీను, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మాబు సుభాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply