పందులన్నీ తరలించాల్సిందే..

పందులన్నీ తరలించాల్సిందే..
దిలావర్ పూర్, ఆంధ్రప్రభ : గ్రామంలో పందుల స్వైర విహారం పెరిగి విచ్చలవిడిగా తిరుగుతుండడంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని దిలావర్ పూర్ గ్రామ ప్రజలు పందుల నివారణ చర్యలకు నడుం కట్టారు. ఎంపీఓ గోవర్దన్ ఆద్వర్యం గ్రామస్తులు శనివారం రోజున సమావేశం ఏర్పాటు చేశారు. పందుల బెడదతో గ్రామంలో పారిశుద్య సమస్యలు తలెత్తుతున్నాయని, అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నందున సత్వరమే పందుల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామ పెద్దలు వాపోయారు.
పందులు పెంపుడు జంతువులు అని కావున వాటిని ఖచ్చితంగా షెడ్లలో మేత వేస్తు పెంచుకోవాలి కానీ ఇష్టరీతిన గ్రామంలో వదిలేయడం వల్ల గ్రామంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఖచ్చితంగా 15 రోజుల్లో పందులను తరలించాలని గ్రామ పెద్దలు పందుల యజమానులను హెచ్చరించారు. వా పందుల యజమానులు పందుల తరలింపుకు అంగీకరిస్తూ హామీ పత్రం రాసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్దె అక్షర అనిల్, ఉపసర్పంచ్ నడుకుడ సుఖేష్, పంచాయితీ కార్యదర్శి మహేంధర్, గ్రామ పెద్దలు కోండ్ర బక్కన్న, నడుకుడ పోశెట్టి, మోహన్ రెడ్డి, సప్పల నర్సయ్య, అనిల్, హరుణ్, నారాయణ, సాయి, వినోద్, రవి పందుల యజమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
