Upto85%Depend |భారత్‌పై యుధ్ద ప్రభావం…?

Upto85%Depend | భారత్‌పై యుధ్ద ప్రభావం…?
అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలపై ఒత్తిడి
గల్ఫ్ ప్రాంత అస్థిరత – సరఫరా అంతరాయం భయం
ముడి చమురు పెరిగితే పెట్రోల్ ధరలు వెంటనే పెరుగుతాయా?
రూపాయి–డాలర్ మారకం, పన్నుల ప్రభావం ఎంత?
ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ముప్పు
ప్రభుత్వ చర్యలపై ఆధారపడే తుది నిర్ణయం
Upto85%Depend | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతాయా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. భారత్ తన అవసరాలకు సరిపడే ముడి చమురులో దాదాపు 80–85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే, దాని ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చమురు సరఫరాపై అనిశ్చితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. అక్కడ పరిస్థితులు అస్థిరంగా మారితే: సరఫరా అంతరాయం భయం పెరుగుతుంది. రవాణా మార్గాల భద్రతపై అనుమానాలు రేకెత్తుతాయి. బీమా ఖర్చుల పెరుగుదల అనివార్యమవుతుంది. ట్రేడింగ్ మార్కెట్‌లో ఊహాగానాలు ఊపందుకుంటాయి.ఇన్ని కారణాల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడే అవకాశం ఉంది.

భారత్‌లో వెంటనే పెట్రోల్ ధరలు పెరుగుతాయా, అనేది ప్రస్తుతం భయం కలిగిస్తోన్న సందేహం. పెట్రోల్, డీజిల్ ధరలు నేరుగా ముడి చమురు ధరలకే పరిమితం కావు. రూపాయి – డాలర్ మారకం విలువ అనేవి వాటిపై ప్రభావం చూపే అంశాలు అవేకాక, కేంద్ర, రాష్ట్ర పన్నులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరల విధానం, ప్రభుత్వం తీసుకునే ధర నియంత్రణ నిర్ణయాలు, ముడి చమురు ధరలు పెరిగినా, ప్రభుత్వం పన్నుల్లో సర్దుబాటు చేస్తే వినియోగదారులపై భారం తగ్గే అవకాశం ఉంది.
అయితే అంతర్జాతీయంగా ధరలు నిరంతరం పెరిగితే, దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అనివార్యం కావచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే సరుకుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పన్నుల తగ్గించవచ్చు. వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగంలోకి తేవచ్చు.

పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా, మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రవాణా, వ్యవసాయం, తయారీ రంగాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఆందోళనలో ఉన్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్ ధరలు వెంటనే పెరుగుతాయా లేదా అన్నది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.