ఘనంగా సైన్స్ దినోత్సవం..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం వెల్గనూర్,గుడిరేవు ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ముందుగా 118 మూలకాలతో కూడిన నవీన ఆవర్తన పట్టిక చిత్రాన్ని రంగులతో వేశారు. అనంతరం పలువు విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రయోగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి రాజన్న, గుడిరేవు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మల్లూరి శ్రీనివాస్, సైన్సు ఉపాధ్యాయులు వేణుగోపాల్, భూమన్న, గంగన్న,సల్మా, లచ్చన్న, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
