పిట్లంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : రేపు పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రామన్నరని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య, జుక్కల్ మండల అధ్యక్షులు ఐల్వర్ మారుతి, నాయకులు ఎస్టిడి సురేష్ తెలిపారు.జుక్కల్ మండల కేంద్రంలో వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారానికి,పొడు భూముల సమస్యలు,ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు,ఎస్సి గురుకుల మరియు హాస్టల్లో మౌలిక సదుపాయాల కొరత,కులవివక్షతకు గురైన వారికిఅండగా నిలుస్తూ, ఆయన సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి,జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి రెండు సామాజిక వర్గానికి చెందిన వారందరూ సకాలంలో పిట్లం కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply