పోలుకొండ గ్రామంలో నిరుపేద ప్రజల ఆందోళన..

పోలుకొండ గ్రామంలో నిరుపేద ప్రజల ఆందోళన..

  • ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పైపులైను నిర్మిస్తున్నారంటూ
  • ప్రజలకు ఉపయోగపడే విధంగా పైపులైను నిర్మించాలంటూ నిరుపేదల విజ్ఞప్తి
  • సమస్యను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే రాముకు నిరుపేద ప్రజల విజ్ఞప్తి

నందివాడ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా కాకుండా పైపులై నిర్మాణం చేపడుతున్నారంటూ పోలుకొండ గ్రామంలోని చంద్రయ్య కాలువ కరకట్టపై నివాసముంటున్న నిరుపేద ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు. గ్రామంలోని చంద్రయ్య కాలువ కరకట్టపై దశాబ్దాల కాలంగా నిరుపేద బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన ఎస్టీ వర్గాలు నివాసం ఉంటున్నారు. నివాసాలకు సంబంధించి పంచాయతీకి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కానీ వారికి నీటి సదుపాయం అవకాశము లేకుండా పోయింది. దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న పంచాయతీ టాప్ నుండి 100 కుటుంబాల వారు నీటిని తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది.

ఇప్పటికే తాగు నీటిని కొనుగోలు చేసి తాగుతున్న వారికి కనీస వాడుక నీటు కరువైంది. పాలకులు ప్రభుత్వాలు మారిన వారి సమస్యలను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. మంచినీటిని కొనుగోలు చేసి తాగుతున్న వారికి వాడుకు నీటి సైతం కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. తెచ్చుకోలేనివారు కలుషిత చంద్రయ్య కాలవ డ్రైనేజీ నీటిని వాడుకునే దుస్థితి నెలకొంది. పైపులైన్ నిర్మాణం చేపట్టాలంటే అధికారులను పాలకొలను వేడుకుంటూ వచ్చారు. ఇటీవల కాలంలో పైపులై నిర్మాణానికి మండల నిధులు రూ 3 లక్షలు పంచాయతీ నిధులు రెండు లక్షలు వెరసీ 5 లక్షల నిధులతో పైపులై నిర్మాణం చేపట్టారు. పంచాయతీ వారు ప్రజా ప్రయోజనాలను విస్మరించి గృహాలను ఆనుకుని కాకుండా జి పి కే రోడ్డు అవతల వైపు నిర్మాణం చేపట్టారు.

100 కుటుంబాలకు సంబంధించి నాలుగు పబ్లిక్ టాపులు నిర్మాణం చేపడతామని చంద్రయ్య కాలువ వాసులకు తెలపడంతో అవతల వైపు పైపులైను నిర్మాణం చేపడితే మాకు ఇబ్బంది కలుగుతుందని మా గృహాల వైపు ఆనుకుని నిర్మాణం చేపడితే వ్యక్తిగతంగా టాప్లు ఏర్పాటు చేసుకుంటామని అవతల వైపు నిర్మాణం చేపట్టడం వలన మాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పబ్లిక్ టాపుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉంటుందని యువతల వైపు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అవతల వైపు నిర్మాణం చేపడుతున్న పనులను నిలుపుదల చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రాము జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వేడుకొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు

Leave a Reply