డీజీపీ శివధర్‌రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు

డీజీపీ శివధర్‌రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు

దాడులకు పాల్పడిన ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
డీజీపీని కలిసిన బిజెపి రాష్ట్ర నాయకులు
ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు

నిజామాబాద్ ,ఆంధ్రప్రభ: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల దాడులకు పాల్పడిన ముష్కరు లపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి ని బిజెపి రాష్ట్ర నాయకులు, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు కోరారు. హైదరాబాద్ లో డిజిపి కార్యాలయంలో డీజీపీ శివధర్‌రెడ్డిని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుఎన్. రామ చంద్రరావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మె ల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌత మ్ రావు, అశోక్, కామా రెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం రాజు, ఇందూర్ జిల్లా ప్రభారి కాంతారావు, కామారెడ్డి జిల్లా ప్రభారి విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే యెండల లక్ష్మీనారా యణ, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆంటోనీ రెడ్డి, బిజెపి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, బిజెపి సీని యర్ నాయకు లు మురళీ ధర్ గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడారు.


గత కొద్ది రోజులుగా బా న్సువాడ, రుద్రూర్, ఇందూ ర్ అర్బన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాం తాలలో కొంతమంది ము ష్కరులు ఉద్దేశపూర్వ కంగా దాడులకు పాల్ప డుతున్నారనీ తెలిపారు.
దాడులకు పాల్పడిన ము ష్కరులను, వారికి వెనకుం డి సహకరిస్తున్న శక్తులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలనీ కోరారు. అదేవిధంగా సున్నితమైన ప్రాంతాలలో తక్షణమే అదనపు పోలీ సు బలగాలను మోహ రించి, భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత కల్పిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply