Temple | మార్చి 8న మహా కుంభాభిషేకం..

Temple | మార్చి 8న మహా కుంభాభిషేకం..

అమ్మవారి కుంభాభిషేక మహోత్సవం
మార్చి 6 నుంది 8 వరకు విస్తృత కార్యక్రమాలు
విస్తృత ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం అధికారులు..

Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ప్రఖ్యాత శక్తి క్షేత్రంలో కుంభాభిషేక మహోత్సవం–2026ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు శాస్త్రోక్త సంప్రదాయాలకు నిలయంగా ఈ కుంభాభిషేకం నిలుస్తోంది.

పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారిని తన హృదయంలో కొలువై ఉండాలని కోరగా, అమ్మవారు అతడిని పర్వతరూపంలో (కీలాద్రి) ఉండమని వరమిచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. దుర్గమాసురుడిని సంహరించిన అనంతరం ఆదిపరాశక్తి ఇక్కడ స్వయంభువుగా అవతరించింది. జగద్గురు ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతస్వరూపిణిగా మార్చేందుకు శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి శ్రీసూక్త ఆర్చన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే క్షేత్రంలో అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందగా, పరమేశ్వరుడు శ్రీ మల్లేశ్వర స్వామిగా ఆవిర్భవించినట్లు విశ్వాసం.

Temple | కుంభాభిషేకం ప్రాముఖ్యత..

Temple |

ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయంలో దైవిక శక్తిని పునరుద్ధరించేందుకు కుంభాభిషేకం నిర్వహించడం అనివార్యం. ఆలయ గోపురంపై కలశంలో విష్ణువు, శివుడు, బ్రహ్మ మరియు మాతృదేవతలు స్థితిచేస్తారని విశ్వాసం. పుణ్యనదులు, తీర్థాలు, సప్త సముద్ర జలాలతో కలశాలను నింపి యాగశాలలో మంత్రోచ్ఛారణలతో పూజించి, ఆలయ శిఖరంపై అభిషేకం చేయడమే కుంభాభిషేకంగా భావిస్తారు. మంత్ర,యంత్ర,తంత్ర సమ్మేళనంగా జరిగే ఈ మహాక్రతువు ప్రజల సంక్షేమం, విశ్వశాంతికి దోహదపడుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.

Temple |

Temple | కార్యక్రమాలు ఇలా..

Temple |

మహా కుంభాభిషేకంలో భాగంగా మార్చి 6, 2026 (శుక్రవారం) యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వాచనం, దీక్షాధారణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, హవనాలు, హారతులను నిర్వహిస్తారు. మార్చి 7 (శనివారం) పవిత్ర నదీ జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠపూజలు, హవనాలు, ప్రదోషకాల కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 8, ఆదివారం ఉదయం యాగశాలలో పూజలు అనంతరం ఉదయం 9:34 గంటలకు మేషలగ్నంలో ప్రధాన కుంభాభిషేకం జరుగుతుంది.

Temple |

Temple | పీఠాధిపతి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం..

Temple |

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో నిర్వహించే పవిత్ర మహా కుంభాభిషేకంలో భాగంగా శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి కరకమలాలతో ఆలయ శిఖర విమానగోపురంపై పుష్కర నదీజలాలతో కుంభాభిషేకం నిర్వహించబడుతుంది. అనంతరం ప్రధాన మూర్తులకు మార్జన కార్యక్రమం జరుగుతుంది. కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళావేదికపై పీఠాధిపతి అనుగ్రహ భాషణం నిర్వహించనున్నారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని దేవస్థానం అధికారులు కోరుతున్నారు.

Temple |

Leave a Reply