Spicejet | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే…

Spicejet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. న్యూఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరిన విమానం ఇవాళ ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా తిరిగి ఢిల్లీకి చేరింది. బోయింగ్ 737 విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులున్నారు. ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా, ప్రయాణికులందరినీ సేఫ్ గా దించినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి ధృవీకరించారు.

Leave a Reply