ఘనంగా చింతల జన్మదిన వేడుకలు..

ఘనంగా చింతల జన్మదిన వేడుకలు..

  • రోగులకు పండ్ల పంపిణీ..
  • వృద్ధాశ్రమంలో అన్నదానం..

భువనగిరి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతల యువసేన అభిమానుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన వితరణ గావించారు.

ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వెంకటేశ్వరరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారి ఆశీస్సులతో భవిష్యత్తులో ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వల్లపు విజయ్, దండబోయిన బలరాజ్ యాదవ్, గాజుల నవీన్, పల్లెపాటి రవికుమార్, ఎలిమినేటి మహేంద్ర రెడ్డి, దోషపాటి హరీష్, గూదే శ్రీశైలం, మోతే మనోహర్, నాగారం నరేష్ చింతల యువసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply