దోస్త్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం

దోస్త్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం

చెట్టును ఢీకొన్న కారు
అక్కడికక్కడే రెవిన్యూ ఉద్యోగి మృతి
ముగ్గురికి గాయాలు… లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

కడెం, ఆంధ్రప్రభః నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ పరిధిలో గల దోస్త్ నగర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందగా ముగ్గురికి గాయాలు పాలయ్యారు.

మంచిర్యాల జిల్లా జాఫర్ నగర్ వాడకు చెందిన ల్యాండ్ అండ్ రెవెన్యూ సర్వే డి ఐ నసీరుద్దీన్ నిర్మల్ జిల్లా కేంద్రం నుండి తన కారులో కుటుంబ సభ్యులతో మంచిర్యాలకు వెళుతుండగా మార్గమధ్యంలో కడెం మండలం దోస్త్ నగర్ సమీపంలో తాను ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కనే బలంగా ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే నసీరుద్దీన్ (50) మృతి చెందాడు.

అదే కారులో ఉన్న బిలాలోద్దీన్ కూతురు నేహ సహారీన్ మనువడు హైరా హురన్ లకు గాయాలయ్యాయి సంఘటన స్థలానికి కడెం 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది ఈఎంటి మురళి పైలట్ వసంత్ చికిత్స నిమిత్తం వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి కడం పి ఎస్ ఎస్ ఐ పి సాయికిరణ్ చేరుకొని కేసు నమోదు చేసి కొనసాగిస్తున్నారు.

Leave a Reply