Indrakeeladri | హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు

Indrakeeladri | హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు
- రోజుకు సగటు రూ.17 లక్షలు
- బంగారం వెండి విదేశీ డాలర్ల బహుమానం..
Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ ఆదాయం గణనీయంగా నమోదైంది. ఫిబ్రవరి 4, నుంచి ఫిబ్రవరి 21 వరకు మొత్తం 17 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో రూ.2,89,12,052 ఆదాయం లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. ఇందులో కరెన్సీ నోట్ల రూపంలో రూ.2,75,86,052, నాణేల రూపంలో రూ.13,26,000 వసూలైనట్లు తెలిపారు. హుండీలలో నగదుతో పాటు విలువైన బంగారు వెండి కానుకలు కూడా లభించాయి.
బంగారం 171 గ్రాములు, వెండి 2 కిలోలు 880 గ్రాములు భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించారు. ఈ 17 రోజుల కాలంలో రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.17,00,708గా నమోదవడం విశేషంగా నిలిచింది. విదేశీ భక్తుల నుంచి కూడా విరాళాలు గణనీయంగా వచ్చాయి. అమెరికా డాలర్లు 820, ఇంగ్లాండ్ డాలర్లు 40, మలేషియా రింగిట్ 31, సింగపూర్ డాలర్లు 22, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు 105, ఆస్ట్రేలియా డాలర్లు 20, కువైట్ దినార్ 1/4, ఒమన్ రియాల్ 1, ఒమన్ బైసా 400, యూరోలు 55, కెనడా డాలర్లు 505, సౌదీ రియాల్ 1 భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించారు.

అదనంగా హుండీలలో పాత కరెన్సీ నోట్లు కూడా లభించాయి. రూ.2000 నోట్లు 16 ఉండగా, రూ.1000, రూ.500 నోట్లు లభించలేదు. మొత్తంగా చూస్తే, కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నిరంతరంగా కొనసాగుతుండటంతో హుండీ ఆదాయం స్థిరంగా పెరుగుతోంది. నగదు, బంగారం, వెండి విదేశీ కరెన్సీ రూపంలో భక్తులు సమర్పిస్తున్న విరాళాలు ఆలయ ప్రాముఖ్యతను మరింత బలపరుస్తున్నాయి.

