Jcb Driver | హైటెన్షన్ వైర్లు తగిలి…

Jcb Driver | హైటెన్షన్ వైర్లు తగిలి…
Jcb Driver | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో జేసీబీ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.
జేసీబీ బకెట్ హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో ఒక్కసారిగా భారీ స్పార్క్ ఏర్పడి, డ్రైవర్‌కు తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో జేసీబీ క్యాబిన్‌లోనే సజీవదహనమై ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడిని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరాజుగా పోలీసులు గుర్తించారు.
