13th Ward | భవిష్యత్తుకు మార్గదర్శి మై టీడీపీ యాప్..!

13th Ward | భవిష్యత్తుకు మార్గదర్శి మై టీడీపీ యాప్..!
- టీడీపీ యువ నాయకుడు గౌతమ్ జూలకంటి
13th Ward | మాచర్ల, ఆంధ్రప్రభ : ప్రజలందరి భవిష్యత్తుకు మార్గదర్శి మై టీడీపీ యాప్ అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు, టీడీపీ యువ నాయకులు గౌతమ్ జూలకంటి చెప్పారు. గురువారం 13వ వార్డుల్లో ఇంటింటికి తిరిగి మై టీడీపీ యాప్ ను తాను డౌన్ లోడ్ చేసుకున్నానని, మీరు చేసుకోండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డు వీధుల్లో మై టీడీపీ యాప్ గోడ పత్రులను ఇంటి గోడలకు స్వయంగా అంటించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, మై టీడీపీ యాప్ నందు ప్రభుత్వ తీసుకునే నూతన నిర్ణయాలు, సంక్షేమం, అభివృద్ది పథకాల వివరాలు వంటి అనేక ప్రజా ప్రాయోజిత సమాచారం అందుబాటులో ఉంటుందని, ప్రతిఒక్కరికీ ఆ సమాచారం అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెరా దుర్గారావు, బండ్ల శ్రీనివాసరావు, కజం సైదయ్య, మూడవత్ రెడ్యా నాయక్, షేక్ జానీ, మంజుల అంజి, మంజుల వెంకటేశ్వర్లు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
