1 acre | పప్పు, సెనగ కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించాలి…

1 acre | పప్పు, సెనగ కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించాలి…
1 acre | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని బుధవారం ఉరవకొండ వ్యవసాయ ఏ డీ ఏ కార్యాలయం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులను ఆదుకోవడంలో, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మోపిడి సిద్ధప్ప మాట్లాడుతూ… ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో రబీ సీజన్ లో వేలాది హెక్టార్లలో పప్పు సెనగ పంటను సాగు చేశారన్నారు. పప్పు సెనగ పంట చేతికి వచ్చిందన్నారు. పప్పు సెనగను అమ్ముకుందామంటే, ప్రభుత్వం ఇంతవరకు పప్పు సెనగ కేంద్రాలను ప్రారంభించలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ లో ఉన్న ధరకు, పప్పు సెనగకు అమ్ముతే, పంట సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
గత రెండు సంవత్సరాల నుండి రైతులు తీవ్ర నష్ట పోతున్నారన్నారు. పప్పు సెనగకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదన్నారు. పంట సాగు చేయడానికి 1 ఎకరాకు 20వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కింద 7 వేల రూపాయలతో, పప్పు సెనగను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ కుమార్, సుశీలమ్మ, స్వామి రెడ్డి, ఈడిగ ప్రసాద్, బసవరాజు, గోవిందు, ఓబన్న, ఎర్రి స్వామి, వడ్డే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
