Minister | గ్రంథాలయాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా..

Minister | గ్రంథాలయాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా..

  • ఆధునికీకరణకు రూ. 56.90 కోట్ల బడ్జెట్
  • గుంటూరు చైర్ పర్సన్ వందనా దేవి

Minister | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌లు సహా ఇతర దాతల సహకారంతో గ్రంథాలయాలను బలోపేతం చేస్తున్నామని వందనా దేవి పేర్కొన్నారు.

గ్రంథాలయాలకు మెరుగైన భవనాలు నిర్మించడం, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద వర్గాల విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆమె వివరించారు. అదనంగా, గ్రంథాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

Minister |

ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.56.90 కోట్ల బడ్జెట్ అంచనాలతో పాటు వివిధ ప్రతిపాదనలను సమావేశం ఆమోదించింది. ఈ బడ్జెట్‌లో చుండూరు శాఖా గ్రంథాలయానికి రూ.6.50 లక్షలు, గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.60 లక్షలు, తెనాలి గ్రేడ్-1 శాఖా గ్రంథాలయానికి రూ.23.50 లక్షలు, నిడుబ్రోలు శాఖా గ్రంథాలయానికి రూ.10.50 లక్షలు, వట్టిచెరుకూరు శాఖా గ్రంథాలయానికి రూ.12 లక్షలు, తాడికొండ శాఖా గ్రంథాలయానికి రూ.26 లక్షలు, చిలకలూరిపేట శాఖా గ్రంథాలయానికి రూ.13.93 లక్షలు, నరసరావుపేట శాఖా గ్రంథాలయానికి రూ.13.60 లక్షలు, సత్తెనపల్లి శాఖా గ్రంథాలయానికి రూ.6.10 లక్షలు,

ఈపూరు శాఖా గ్రంథాలయానికి రూ.12.50 లక్షలు, గురజాల శాఖా గ్రంథాలయానికి రూ.18.50 లక్షలు, మాచర్ల శాఖా గ్రంథాలయానికి రూ.17.30 లక్షలు, అమరావతి శాఖా గ్రంథాలయానికి రూ.19 లక్షలు కేటాయించి ఆధునీకరణకు అంచనాలను ఆమోదించారు. అలాగే, వివిధ గ్రంథాలయాల పరిధిలోని వాణిజ్య సముదాయాలను అద్దెకు టెండర్ల ద్వారా ఇవ్వడం, ఇతర పరిపాలన మరియు నిర్వహణ సంబంధిత అంశాలపైనా సమావేశం అనుమతి తెలిపింది. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ ఎజెండా వివరాలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు కె. ఆంజనేయులు, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్, డివిజనల్ పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply