End | శ్రీశైలం పుణ్యం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ముగింపు..

End | శ్రీశైలం పుణ్యం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ముగింపు..

ఇప్పటివరకు సుమారుగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న వైనం..
నేడు అశ్వవాహన సేవ.. పుష్ప ఉత్సవం..

End |నంద్యాల బ్యూరో,ఆంధ్రప్రభః దేశంలోని జ్యోతుల లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో శ్రీశైలంలో వెలిసిన ఆరో లింగమైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమం బుధవారంతో పూర్తికానున్నాయని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి నీ పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించామన్నారు. సుమారుగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని స్వామివారి ని ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించుకోవడం జరిగిందన్నారు. మొదటిరోజు సంఘటన మినహా ప్రశాంతంగా 11 రోజులు భక్తులకు విశిష్ట సేవలు అందించామని కార్యనిర్వాహణాధికారి పేర్కొనటం విశేషం. వాహనసేవలో భాగంగా బుధవారం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిపించబడుతుందన్నారు.ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేయబడుతాయన్నారు.. తరువాత ఆలయ ఉత్సవం నిర్వహించబడుతుందన్నారు.

పుష్పోత్సవం – శయనోత్సవం…

ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించ బడుతుందన్నారు. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామిఅమ్మవార్లను పసుపు చేమంతి, తెలుపు, చేమంతి, నీలం చేమంతి నందివర్థనం, గరుడవర్థనం, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, మందారం, ఎర్ర ఆస్టర్, నీలం ఆస్టర్, కాగడాలు, మల్లెలు, కనకాంబరాలు, ఎర్రగులాబిలు, పసుపు గులాబీలు, బహువర్ణ గులాబీ, ఊదా గులాబి మొదలైన 21 రకాలకు పైగా పుష్పాలతో విశేషంగా ఆర్చించడం జరుగుతుందన్నారు. తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవను నిర్వహించి శయనోత్సవం జరిపించబడుతుందన్నారు. కార్యక్రమంలో వేద పండితులు పూజారులు పలు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply