skills | విద్యార్థుల మానసిక ఉల్లాసానికి కృషి చేయాలి..

skills | విద్యార్థుల మానసిక ఉల్లాసానికి కృషి చేయాలి..

శిక్షణలోని మెలకువలను క్రింది స్థాయిలో అమలు చేయాలి..

skills | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభః జిల్లావ్యాప్తంగా ఉన్న బంతి సెంటర్లలోని మానసిక వికలాంగుల విద్యార్థులను ప్రతి ఒక్కరూ ఆదరణగా ప్రేమగా చూసుకోవాలని ప్రభుత్వం వారి కోసం కొట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్రింది స్థాయిలోని భవిత కేంద్రాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం వారి అభివృద్ధి పాటుపడాలని సెంటర్లలో అమలు చేయాలని సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానంద పేర్కొన్నా రు.

డిప్యూటీ డిఈఓ కార్యాలయంలో శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం లో పాల్గొన్నరు.ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర రిసోర్స్ పర్సనల్ అధికారులుగా జస్నా, బ్రిజిత్ మరియా అంటో లతో శిక్షణ వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఐ డి ఎస్ ఎస్ స్కూల్ అసిస్టెంట్లు, ఐ ఈ ర్ పి లు హెచ్ ఐ మరియు ఎం ఆర్ ఉపాధ్యాయులు శిక్షణ అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుని మీ మండలాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసర పిల్లల విద్యను వారికి అర్థమయ్యే విధంగా బోధన చేయాలని ఈ అధునాతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఉపాధ్యాయులందరికీ ట్యాబ్ లను అందజేయడం జరిగిందని దాని ద్వారానే విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా బోధన సామాగ్రాలను అందులో కేంద్రీకరించి దృష్టి పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. స్పెషల్ ఉపాధ్యాయులు చక్కగా శిక్షణ పొంది జిల్లాను ప్రధమ స్థానంలో వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఈ జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి, ఏపీవో రామ్మోహన్, సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు, ఐఈఆర్టిలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply