ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మందుల సత్యం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్ర చరిత్రాత్మకమని,ఆయన పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పగిల్ల సతీష్,మండల సంయుక్త కార్యదర్శి మాదనబోయిన పరమేష్,మండల నాయకులు మారగోని అంజయ్య గౌడ్,పూల వెంకటేశం, పొలగోని సైదులు గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, జంగిలి సాంబయ్య, యడవల్లి సురేష్, నల్గొండ అంజి, ఈద శరత్,సింగం సైదులు, సురేందర్, దెందే మల్లేష్, వరంగంటి శంకర్, ఐతగోని విజయ్,బోయ లింగస్వామి, దోటి కర్ణాకర్, బండారు శ్రీనివాస్, దోటి రమేష్, పగిల్ల రాము, కందుల రాజు గౌడ్, ఉప్పునూతల శ్రీశైలం,కొమ్మినేని పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply