బోణి కొట్టిన వరంగల్ కమిషనరేట్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; వరంగల్ కమిషనరేట్ పోలీసులు నాలుగోవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ డ్యూటీ మీట్ లో బంగారు పతకంతో బోణి కొట్టారు. మంగళవారం నుండి ప్రారంభమైన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ డ్యూటీ మీట్ లో ఓరుగల్లు పోలీసులు సత్తా చాటుతున్నారు.ఈ క్రీడల్లో మొదటగా నిర్వహించిన పది కిలోమీటర్ల పరుగు పందెంలో వరంగల్ రిజర్వ్ విభాగానికి చెందిన గూగులోత్ మౌనిక 10 కిలో మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించారు.గూగులోత్ మౌనిక గోల్డ్ మోడల్ తో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పతకాల ఖాతాను ప్రారంభించారు. ఈ మెడల్ సాధించిన మౌనికకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు

Leave a Reply