Vaccinations | టీకాల ప్రాముఖ్యతపై శిక్షణ…

Vaccinations | టీకాల ప్రాముఖ్యతపై శిక్షణ…

Vaccinations | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల యందు గురువారం కెవికె సమన్వయకర్త డా.డి సుధారాణి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు పెరటి కోళ్లలో సమయానుకూల టీకాలు ప్రాముఖ్యతపై శిక్షణ కార్యక్రమం కెవికె విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధారాణి గారు మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని కొద్దిపాటి టీకాలు సూచనలు పాటిస్తే కోళ్లులో మరణాల రేటు తగ్గించి సక్సెస్ రేట్ ని చూడొచ్చని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త నవీన్ మాట్లాడుతూ పెరటి కోళ్లులో వచ్చే వ్యాధులను వివరిస్తూ వాటిని నివారించడానికి ఏ విధమైన టీకా కార్యక్రమాలు చేపట్టాలని రైతులకు సూచించి వివరించారు. శాస్త్రవేత్త యశ్వంత్ మాట్లాడుతూ పెరటి కోళ్లలో గల వివిధ రకాల జాతులు మరియు వాటి ప్రాముఖ్యత ఉపయోగాలు గురించి క్షుణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెవికె సమన్వయకర్త డా డి సుధారాణి గారు, శాస్త్రవేత్తలు డా. నవీన్, జే. యశ్వంత్ మరియు గ్రామీణ యువత పాల్గొన్నారు.

Leave a Reply