మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం..

మక్తల్, ఆంధ్రప్రభ ; హిందూవాహిని ఆధ్వర్యంలో శివాజీ అభిమానులతో హిందూ యువ సామ్రాట్ ఛత్రపతి శివాజిమహారాజ్ జయంతి శోభయాత్ర మఖ్య అతిథిగా రావాలంటూ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి హిందూ వాహిని ప్రఖండ అధ్యక్షులు విజయకృష్ణ ఆహ్వాన పత్రం అందజేశారు. తప్పకుండా శివాజీ జయంతి శోభయాత్రకు హాజరవుతానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 19 న నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ నల్లజానమ్మ దేవాలయం నుండి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు శోభయాత్ర ఉంటుందని వారు తెలిపారు.19న సాయంత్రం సాయంత్రం 6:30 గంటలకు ఛత్రపతి శివాజీ జయంతి శోభయాత్రలో హిందూ బందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన వారిలో హిందూ వాహిని నాయకులు సివి.ప్రవీణ్, అంజన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply