Congress l కౌన్సిలర్ కత్తి నరేందర్ కు సన్మానం..

Congress l కౌన్సిలర్ కత్తి నరేందర్ కు సన్మానం..
Congress, నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని ఒకటో వార్డు గాంధీనగర్ కు చెందిన కత్తి నరేందర్ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాల ప్రభాకర్ తో కలిసి సోమవారం సాయంత్రం గాంధీ నగర్ కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ కత్తి నరేందర్ ను కాలనీ వాసులతో కలిసి శివకుమార్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సైన్డ్లా శ్రీధర్ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
