Corporation | భార్య డిప్యూటీ మేయర్… భర్త కార్పోరేటర్

Corporation |భార్య డిప్యూటీ మేయర్… భర్త కార్పోరేటర్
Corporation | నిజామాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భా ర్య డిప్యూటీ మేయర్ గా భర్త కార్పొరేటర్ గా ప్రమా ణ స్వీ కారం చేసిన అరు దైన సన్ని వేశం చోటుచేసు కుంది. నిజామాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్ ఎన్ని కల్లో భార్యాభర్తలు ఎంఐ ఎం పార్టీ నుంచి బరిలో నిలిచి ఇద్దరూ ఎన్నిక ల్లో విజయం సాధించారు. ఈ దంపతులు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి సమక్షంలో ప్రమా ణ స్వీకారం చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి 54వ డివిజన్ (బోధన్ రోడ్డు ముజాహిద్ నగర్) నుంచి సల్మాన్ తహసీన (భార్య) 52వ డివిజన్( ఖి ల్లా రోడ్డు మహమ్మదీయ కాలనీ) నుంచి మహమ్మద్ షకీల్ హైమద్ ఎన్నికల బరిలో నిలవగా విజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 14 స్థానాలు విజయం సాధించగా కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ఎంఐఎం పొత్తుతో కాంగ్రెస్ పార్టీ నుంచి మే యర్, ఎంఐఎం పార్టీ నుం చి డిప్యూటీ మేయర్ ఎన్నికయ్యారు. సోమవారం కార్పొరేషన్ కార్యాల యంలో డిప్యూటీ మేయర్ గా సల్మాన్ తహ సీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కార్పొరేటర్ గా మహమ్మద్ షకిల్ అహ్మద్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
వరుసగా మూడోసారి హ్యాట్రిక్…
కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి మహమ్మద్ షకిల్ హైమద్ కార్పొరేటర్ గా విజయం సాధించి హ్యాట్రిక్ గా నమో దయ్యారు.
