స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ!

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ!

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు హాజరు…
కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ..ఫలితాలపై ఉత్కంఠ

స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి16, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఇవాళ కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికలను ఆర్డీవో వెంకన్న ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సమావేశానికి 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 5 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు.

ముందుగా క్యాంపు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యాలయం తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ లైన్‌పై కౌన్సెలర్ లకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అనంతరం సీఐ వేణు బందోబస్త్ మధ్య కౌన్సిలర్లను కార్యాలయానికి తరలించారు. తర్వాత బీఆర్‌ఎస్ కౌన్సి లర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక ఫలితాలు కొద్దీ గంటల్లో వెలువడాల్సి ఉంది.

Leave a Reply