Award | అఫ్రోజ్‌కు ‘సైబర్ సురక్షా చాంపియన్’ అవార్డు

Award | అఫ్రోజ్‌కు ‘సైబర్ సురక్షా చాంపియన్’ అవార్డు
Award | విజయవాడ, క్రైమ్, ఆంధ్రప్రభ : సైబర్ నేరాల నివారణలో చురుకైన చర్యలు చేపట్టిన మాచవరం ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ అఫ్రోజ్‌ను నగర పోలీసులు సత్కరించారు. సైబర్ సురక్షా చాంపియన్ మెమెంటోను సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న అందజేశారు.నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు “జీరో టాలరెన్స్ టు సైబర్ క్రైమ్” నినాదంతో సైబర్ నేరాల అరికట్టడంపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో బ్యాంకుల్లో అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు.మాచవరం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అధిక మొత్తంలో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేసే వినియోగదారులకు ప్రత్యేక ప్రశ్నావళిని చదివించడం ప్రారంభించారు. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తదితర సైబర్ మోసాలపై పోలీస్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆర్‌టీజీఎస్ పాయింట్ల వద్ద కూడా అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేశారు.

అవసరమైతే సంబంధిత పాంప్లెట్లను వినియోగదారుల దరఖాస్తులకు జతచేస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ కృష్ణ ప్రసన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన చర్యల ద్వారా ప్రజలు,వృద్ధులు, సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. నగరంలోని ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు.ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ రాజశేఖర్, మాచవరం ఇన్స్పెక్టర్ డీవీ రమణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు దుర్గా ప్రసాద్, శ్రీను, ఎస్‌ఐలు , సిబ్బంది పాల్గొన్నారు.
