Sarpanch | రూ. 10 లక్షలతో గ్రామైక్య సంఘ భవన నిర్మాణం

Sarpanch | జైనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పాన పటార్ గ్రామపంచాయతీకి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి 10 లక్షలు మంజూరు కావడంతో భవన నిర్మాణ పనులను బుధవారం పానపటార్ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ గ్రామైక్య సంఘం మహిళలతో కలిసి పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తులసి శంకర్ మాట్లాడుతూ… గ్రామ ఐక్య సంఘం మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు.
భవనం నిర్మాణంతో ఎంతో సౌకర్యం కలుగుతుందని ఇందులో సమావేశాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. భవన నిర్మాణంలో నాణ్యత లోపించకుండా త్వరగా భవనం పనులు పూర్తయ్యేలా గ్రామైక్య సంఘం మహిళలు కృషి చేయాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమములో గ్రామపటేల్ ఆత్రం. భీంరావ్, గ్రామ పెద్దలులక్ష్మణ్ రావ్, బాలు, శంకర్, లక్ష్మణ్ మహిళా సంఘ అధ్యక్షుడు ఆత్రం రాజ్య లక్ష్మీ, వివో సంఘ నాయకురాలు శాంతబాయి, ఇంద్రజ, తదితరులు పాల్గొన్నారు.
