TG | సంగారెడ్డి, సదాశివపేట పురపాలకంపై ఎగిరేది గులాబీ జెండానే

TG | సంగారెడ్డి, సదాశివపేట పురపాలకంపై ఎగిరేది గులాబీ జెండానే

సదాశివపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో సదాశివాపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సదాశివాపేట పట్టణంలోని 10వ వార్డు భాష్యం స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోనుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సదాశివాపేటలో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు మౌలిక వసతుల అభివృద్ధి ప్రజల మనసుల్లో నిలిచిపోయిందన్నారు.. అందుకే మరోసారి బీఆర్ఎస్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సదాశివాపేటతో పాటు సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ, అభివృద్ధికి అంకితమైన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల మద్దతుతో, ఆశీర్వాదంతో రెండు సంవత్సరాల తరువాత తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ప్రజలు అవగాహనతో ఓటు వేసి అభివృద్ధిని కోరే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.

Leave a Reply