Makthal | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం

Makthal | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు రెండో బూతులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య సుచరిత రెడ్డి ఇద్దరు కుమారులు కోడలు తో కలిసి వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని అన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసే వ్యక్తులను మద్దతు ఇవ్వాలన్నారు. ఓటు హక్కు నిజాయితీగా నిబద్దతతో వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన సభ్యులు మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి సూచించారు.
