పులిమామిడి ఆసుపత్రి వద్ద ఆశా కార్యకర్తలు నిరసన..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆశా కార్యకర్తలు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పులిమామిడి పి హెచ్ సి ఆశా కార్యకర్తల అధ్యక్షురాలు పద్మమ్మ, కార్యదర్శి సాబేరా బేగం మాట్లాడుతూ.. రెండు నెలల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆశా కార్యకర్తల వివిధ డిమాండ్లు పరిష్కరించడంతోపాటు రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
