Minister | ఎన్నికల్లో ఓటు విలువను కాపాడండి…

Minister | ఎన్నికల్లో ఓటు విలువను కాపాడండి…
- మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
Minister | మక్తల్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు విలువలు కాపాడాలని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని 7వ వార్డు పరిధిలో 16వ పోలింగ్ బూత్ లో మంత్రి వాకిటి శ్రీహరి తన సతీమణి వాకిటి లలిత ఇద్దరు కుమారులతో కలిసి వచ్చి ఫోటో హక్కును వినియోగించుకున్నారు. మంత్రితోపాటు అదే వార్గహడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీవిద్య నీలగౌడ్, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బి. శంషొద్దీన్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పది అన్నారు. నిజాయితీగా నిస్వార్ధంగా ఓటు విలువను కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బరిలో ఉంటాయని గెలుపు ఓటములు అనేవి సహజమన్నారు. ప్రజల మద్దతుతో గెలుపొందిన వారికి అధికారం దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. మక్తల్ మున్సిపాలిటీ తో పాటు అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీలోను కూడా సస్తగతం చేసుకోవడం ఖాయమని మంత్రి వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.
