
వార్ వన్ సైడ్.. శ్రీవిద్య గెలుపు డిసైడ్..
వార్ వన్ సైడ్.. శ్రీవిద్య గెలుపు డిసైడ్..
మోత్కుర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వార్ వన్ సైడ్.. శ్రీవిద్య గెలుపు డిసైడ్ అని స్థానిక ఓటర్లలో విస్తృత ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిలోని 12 వార్డులలో 8 వ వార్డు కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకెళ్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి పోటీగా బీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఎంకి కేటాయించడంతో సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ.. మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ 8 వ వార్డు సులువుగా విజయ ఢంకా మోగించనుందని ధీమా వ్యక్తం అవుతోంది. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తమను కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థి శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
