@ 1000 videos వెయ్యి పడగల రాణి

Andhara prabha Insight Story
@ 1000 videos వెయ్యి పడగల రాణి Andhara prabha Insight Story
ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి
ఇది మరో ఉన్నవ్ స్టోరీ ?
జనసేనాధినేత సీరియస్
మహిళా కమిషన్ దూకుడు
– ప్రభుత్వానికి నివేదిక సర్వసన్నద్ధం
( తిరుపతి ప్రతినిధి , ఆంధ్రప్రభ):
ఓ మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేజేతులా దొరికిపోయారా? లేక రాజకీయ ప్రత్యర్థుల వలకు చిక్కాడా? అసలు ఆ బాధితురాలు ఏడాదిన్నరపాటు మౌనం పాటించి.. ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? రెండు చేతులు కలిస్తేనే తప్పు జరుగుతుందని కొందరు వాదిస్తున్నా.. నిజంగా ఎమ్మెల్యే ఆ మహిళతో శారీరక సంబంధం నెరపి ఉంటే..ప్రధాన నిందితుడు అతడే.
@ 1000 videos : తెరమీదకు ఉన్నవ్ కథ

నిజమే యూపీలో ఉన్నావ్ ఉదంతం తెరమీదకు వస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఎమ్మెల్యే తనను శారీరకంగా అనుభవించాడని ఆరోపించటంతో.. ఈ కేసు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఫలితంగా అనేక వ్యూహాలు.. ప్రతివ్యూహాల నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే 9 ఏళ్ల 7 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్.

2017లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు 2019లో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు అతనికి జీవిత ఖైదు (మరణించే వరకు జైలు శిక్ష) విధించింది. డిసెంబర్ 23, 2025న ఢిల్లీ హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ అతని జీవిత ఖైదును తాత్కాలికంగా నిలిపివేసింది . సిబిఐ (CBI) హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయగా సుప్రీంకోర్టు , డిసెంబర్ 29, 2025న ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించి, అతడిని జైలులోనే ఉండాలని ఆదేశించింది.
ఈరోజు (ఫిబ్రవరి 9, 2026), బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఢిల్లీ హైకోర్టు మూడు నెలల్లోగా అతని అప్పీల్‌పై తుది నిర్ణయం తీసుకోవాలి. అతడు నిర్దోషి అయితే.. బయటకు వస్తాడు. లేదో జీవితాంతం జైలు కూడు తప్పదు.
@ 1000 videos : ఇక వీణ కేసూ అంతే
ఉన్నవ్ కేసులో బాధితురాలు కూడా ఉద్యోగం ఆశతో లొంగిపోయింది. ఆమె మైనరు కావటంతో .. కేసు తప్పలేదు. అప్పటి యూపీ మహిళ కమిషన్ చైర్మన్ పట్టుబట్టి మరీ కేసు పెట్టించారు. బాధితురాలికి వెన్నుదన్నుగా నిలిచారు. ఇక ఏపీలో వీణ స్థితీ అంతే. అంటే.. ఏపీలోనూ ఇదే స్థితి ఏర్పడుతుందా?

బాధితురాలు వీణ ఆరోపణల ప్రకారం, అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2024 జూన్ 14న టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుని, తనను అసభ్యకర వీడియో కాల్స్ మెసేజ్‌లతో వేధించారని బాధితురాలు ఆరోపించారు. తన మాట వినకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు కలిగిస్తానని, తన మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని బాధితురాలి ఆరోపణ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నరగా శారీరకంగా లొంగదీసుకుని, తాను 5 సార్లు గర్భం ధరించగా బలవంతంగా అబార్షన్లు చేయించారని ఆమె వీడియో స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. తన భర్తను బెదిరించి విడాకులు ఇప్పించారని, తన కుమారుడిని తన నుండి వేరు చేశారని ఆమె ఆరోపించారు.

ఎమ్మెల్యేకు తాను ₹7 లక్షల అప్పుగా ఇచ్చానని, ఇప్పుడు ఆయన తనను పట్టించుకోకుండా “నీకు నచ్చింది చేసుకో” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో ఆరోపణల్లో నిజమెంతో గానీ.. తనతో ఎమ్మెల్యే బంధాన్ని నిరూపించేందుకు ( evidence @ 1000 videos) వెయ్యి వీడియోలు ఉన్నాయని, ఇవ్బన్నీ బయటపెడతానని బాధితురాలు.. చాలా స్పష్టంగా చెబుతోంది. ₹ 25 కోట్ల కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందా? 5 అబార్షన్లు జరిగాయా? లేదా? ఆమె హనీ ట్రాప్ లో ఎమ్మెల్యే చిక్కాడా? అసలు ఈ లైంగిక వేధింపులు అలియాస్ అక్రమ సంబంధం వ్యవహారంలో నిజనిజాలు తేలేలోపు… ఎమ్మెల్యేకు అజ్ఙాత వాసం తప్పటం లేదు. ఎందుకంటే.. ఏపీ మహిళ కమిషన్ చైర్మన్ ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. లోతుగా అన్ని కోణాల్లోనూ విచారణ జరిపారు. సమగ్ర నివేదికను తయారు చేశారు. రేపో మాపో ప్రభుత్వానికి సమర్పిస్తారు.
@ 1000 videos : చట్టం తన పని తాను చేస్తోంది
ఇప్పటికే రైల్వే కోడూరు పోలీసులు ఎమ్మెల్యేపై చీటింగ్ (BNS 318(2)), క్రిమినల్ బెదిరింపులు (BNS 351(2)) వంటి సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. అరెస్టు వంటి కఠిన చర్యలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
@ 1000 videos : చలించిన జన సేనాధిపతి

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ఫిబ్రవరి 2, 2026న జరిగిన జనసేన సర్వసభ్య సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొందరు నేతల “చిట్టా” తన వద్ద ఉందని, అందరి వ్యవహారాలు తనకు తెలుసని హెచ్చరించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే (జనవరి 28, 2026) పవన్ కళ్యాణ్ ఆదేశాల ఎం.ఎస్.ఎం.ఈ (MSME) కార్పొరేషన్ చైర్మన్ టి. శివశంకర్ (T. Siva Shankar), తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ తంబళ్లపల్లి రమాదేవి (Thamballapalli Ramadevi), అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AUDA) చైర్మన్ టి.సి. వరుణ్ (T.C. Varun) త్రిసభ్య కమిటీని నియమించారు. విచారణ పూర్తయ్యే వరకు అరవ శ్రీధర్‌ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని (సస్పెన్షన్ వంటి చర్య) పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
@ 1000 videos : త్రిసభ్య కమిటీపై సీరియస్:

విచారణ నివేదిక ఇవ్వడంలో త్రిసభ్య కమిటీ కాలయాపన చేస్తోందని ఫిబ్రవరి 9న జరిగిన జేఎల్పీ (JLP) సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు జాస్యం జరిగిందని నిలదీశారు, నిజానికి ఫిబ్రవరి 3, 2026న తిరుపతిలోని రాజ్ రెసిడెన్సీలో ఎమ్మెల్యేను దాదాపు 7 గంటల పాటు ఈ త్రిసభ్య కమిటీ విచారించింది. ఈ ఆరోపణలన్నీ “రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర” అని అరవ శ్రీధర్ కొట్టిపారేశారు. ఇందుకు కొన్ని కీలక ఆధారాలను పత్రాలను కమిటీకి సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే శ్రీధర్‌పై పార్టీలో కొనసాగించాలా లేదా అనే విషయంలో పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. “అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాను” అని అరవ శ్రీధర్ ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి, మహిళలపై జరిగే వేధింపుల విషయంలో పార్టీలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ తన వైఖరి ద్వారా స్పష్టం చేశారు.
@ 1000 videos : శ్రీధర్ ఉక్కిరి బిక్కిరి

ఇటీవల మీడియాతో వీణ మాట్లాడుతూ.. శ్రీధర్‌కు సంబంధించి వెయ్యి్కి పైగా వీడియోలు తన వద్ద ఉన్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. సమయం వచ్చినప్పుడు వీడియో సాక్ష్యాలు, అవసరమైతే అవన్నీ బయటపెడతానని ప్రకటించడం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియోలు వ్యక్తిగతంగా తీసినవా? లేక వ్యవస్థాగత లోపాలను చూపించేవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణల కేంద్ర బిందువుగా నిలిచిన శ్రీధర్ పై నేరుగా ఆరోపణలు వినిపించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
@ 1000 videos : పత్యర్థి పార్టీలు రెడీ
ఇక ఈ వ్యవహారంపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు జనసేనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. “నైతిక రాజకీయాలు” అనే నినాదంపై అధికారంలోకి రావాలన్న పార్టీకి ఇది పెద్ద పరీక్షగా మారిందని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియా వేదికగా వీడియోలు, వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
@ 1000 videos : జనసేనలోనూ అసంతృప్తి
పార్టీలోని కొందరు నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలాంటి అంశాల వల్ల ప్రజల్లో పార్టీపై నమ్మకం దెబ్బతింటుందని, తక్షణమే స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నట్టు సమాచారం. అదే సమయంలో, బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. మొత్తానికి, వెయ్యి సాక్ష్యాలంటూ (evidence @ 1000 videos) తెరపైకి వచ్చిన ఈ వివాదం జనసేనకు కీలక మలుపుగా మారింది. రాబోయే రోజుల్లో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఈ ఆరోపణలు ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
@ 1000 videos : మహిళా కమిషన్ దూకుడు

ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై కమిషన్ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ శైలజ స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కమిషన్ రంగంలోకి దిగిందని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజానిజాలను వెలికితీస్తామని ఆమె తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆమె తేల్చి చెప్పారు. ఈ విచారణ సందర్భంగా శైలజ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. “రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి” అనే వ్యాఖ్య ద్వారా ఈ కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నామనే సంకేతం ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
@ 1000 videos : న్యాయం చేస్తామన్న హామీ

ఘటన వెనుక ఉన్న పూర్తి నేపథ్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామని, ఒకే పక్షం వాదనకే పరిమితం కాకుండా అన్ని ఆధారాలతో తుది నిర్ణయానికి వస్తామని శైలజ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా కమిషన్ బాధితుల పక్షానే నిలుస్తుందని ఆమె గట్టిగా భరోసా ఇచ్చారు. సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే భయం లేకుండా కమిషన్‌ను ఆశ్రయించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కేసులో బాధితురాలికి పూర్తి రక్షణ, న్యాయ సహాయం అందిస్తామని, విచారణలో జాప్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ రంగు పులమకుండా మహిళా హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు.
ALSO READ : DanceQueen Real Reel: ఆడే పిల్లే కాదు Andhra prabha TOP story
