Telangana | ముగిసిన మున్సిపల్ హోరు..

Telangana | ముగిసిన మున్సిపల్ హోరు..

ఇక సైలెంట్ …

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో.. అధికారికంగా ప్రచార హోరుకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రచార గడువు ముగిసిన సమయం నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు ‘సైలెంట్ పీరియడ్’ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈనెల 11వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 12,930 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 52.50 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Leave a Reply