AP | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ..

AP | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ..

కమిటీల పూర్తి, కార్యకర్తల చురుకుదనం అవసరం..
వైసిపి 13వ డివిజన్ అధ్యక్షుడు మాగంటి నవీన్

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 13వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్సీపీ డివిజన్ అధ్యక్షుడు మాగంటి నవీన్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి నవీన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సారథ్యంలో డివిజన్‌లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. డివిజన్ స్థాయి కమిటీలన్నీ త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి కార్యకర్త ప్రజల్లో చురుకుగా పనిచేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని, పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కోలా ఉమ, ఉకోటి రమేష్, పిడుగు విజయ్, పల్లి రమేష్, మీరావలి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యకర్తల సమిష్టి కృషితోనే పార్టీ విజయాలు సాధ్యమని సమావేశంలో నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply